భారతదేశం, ఫిబ్రవరి 28 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో చెడ్డ వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని దశరథ్‌కు చెబుతాడు కార్తీక్. ఏం చెప్పినా సరే నా వల్ల కావట్లేదురా. కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకుంటున్నార్రా వాళ్లు. వాళ్ల మొహం చూస్తుంటే కోపం ఆగట్లేదు అని దశరథ్ అంటాడు.

ఇప్పుడు ఎంత ఓపికగా ఉంటే భవిష్యత్ అంత బాగుంటుందని కార్తీక్ అంటాడు. ఇంతలో డాక్టర్ హారిక కాల్ చేసి దీపను తీసుకుని హాస్పిటల్‌కు రమ్మని చెబుతుంది. అదే విషయం చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. మరోవైపు స్వప్న, కాశీల సమస్యకు ముగింపు ఇస్తానని, అది నువ్వే చెప్పాలని, ఇద్దరిని కలపడం నా వల్ల కావడం లేదని కాంచనతో అంటాడు శ్రీధర్.

స్వప్న విడాకులు కావాలంటుంది కదా. అయితే మంచి లాయర్‌ను చూసి విడాకులు ఇప్పించండి, కాశీకి కూడా ఇప్పించండి. ఇద్దరికి వేరే వాళ్ల...