భారతదేశం, మే 27 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ లో తన బద్ధ శత్రువైన దక్షిణామూర్తికి శివ నారాయణ తనకు తెలియకుండానే బ్లడ్ ఇస్తాడు. ఈ విషయం జ్యోత్స్న చెవిలో పడుతుంది. భలే ఛాన్స్ దొరికిందని జ్యో అనుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 27 ఎపిసోడ్ లో చూసేయండి.

కార్తీక, దీప హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. నాకేదో భయంగా ఉందని దీప అంటుంది. దక్షిణామూర్తి తాతకు మా తాత బ్లడ్ ఇచ్చినట్లు నీకు, నాకు, మా నాన్నకు, దక్షిణామూర్తికి తప్పా ఇంకా ఎవరికి తెలియదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని కార్తీక్ చెప్తాడు. కానీ లోపలికి వెళ్లేసరికి హాల్లో అందరినీ కూర్చోబెడుతుంది జ్యోత్స్న. మిమ్మల్ని చప్పట్లతో ఆహ్వానిస్తున్నానని జ్యో ఓవరాక్షన్ చేస్తుంది.

ఈ రోజు వీళ్లు ఓ ప్రాణాన్ని కాపాడారు. అందరూ మెచ్చుకోవాల్సిందేనని జ్యో అనగానే అం...