భారతదేశం, డిసెంబర్ 24 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రీధర్ తప్పు చేయలేదని, చేశాడని రెండు నమ్మట్లేదు అని శివ నారాయణ అంటాడు. నేను ఎవరిని నమ్మట్లేదు. కాశీ గాడే వాంగ్మూలం ఇచ్చాకా నేను ఎవరిని నమ్మాలి అని శివ నారాయణ అంటాడు. కాశీ సాక్ష్యం చెప్పడం ఏంటని దీప, జ్యోత్స్న ఏమైనా చేసిందా అని పారిజాతం షాక్ అవుతారు.

నేను ఎవరిని పూర్తిగా నమ్మలేను. పూర్తిగా అనుమానించలేను. ఇప్పుడు రైడ్ జరిగింది. దీనంతటికి కారణం ఎవరో తెలుసుకో కార్తీక్. తప్పు చేసింది ఇంట్లోవారైన బయటి వారైనా శిక్ష పడాల్సిందే. మోసానికి పాల్పడింది ఇంటి దొంగ బయటి దొంగో త్వరలోనే తెలుసుకుంటాను అని శివ నారాయణ అంటాడు. కాశీ ఇంటికి వెళ్తాడు.

ఇంట్లోంచి బయటకు వెళ్లు అని కావేరి అంటంది. అవకాశం ఇచ్చిన మామ మీద సాక్ష్యం చెప్పడంపై తల్లికూతుళ్లు ఫైర్ అవుతారు. నిన్ను నమ్మి నీకు విలువ ఇస్తే ఇలా చ...