భారతదేశం, ఫిబ్రవరి 20 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 20 ఎపిసోడ్ లో.. నేను చెప్పింది పూర్తిగా వినకుండా సగం నీ తెలివి తేటలు వాడి మీ మామయ్యకు డ్రైవర్ అయ్యావని కాశీతో జ్యోత్స్న అంటుంది. నువ్వు చెప్పింది పూర్తిగా విని ఉంటే జైల్లో ఉండేవాణ్ని. నా మీద జాలితో తాతయ్యతో మాట్లాడి నా మీద కేసు లేకుండా మామయ్య చేశాడని కాశీ చెప్తాడు.

నీలా మనుషులను మోసం చేసి ఏమీ తెలియనట్లు ఉండలేను. నీ వల్లే నేను నా భార్యకు దూరమయ్యానని జ్యోత్స్నతో కాశీ అంటాడు. నీ దెబ్బకు మా అందరి జాతకాలు మారుతున్నాయని పారిజాతం కూడా అంటుంది. నాకు తెలియకుండా చిన్న తప్పు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వరా? నీ ప్లేస్ లో నేను ఉంటే స్వప్నను వదిలేసి వేరేవాళ్లను పెళ్లి చేసుకునేదాన్ని అని జ్యోత్స్న చెప్తుంది.

నీకు ప్రేమ విలువ తెలియదు కాబట్టే మనుషులను తేలికగా వదులుకుంటావని కాశీ కౌంటర్ వేస...