భారతదేశం, మే 20 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్నకు కార్తీక్ దిమ్మతిరిగే షాకిస్తాడు. కార్తీక్ ప్లాన్ తో కాంచన, దీప కూడా శివ నారాయణ ఇంటికి వచ్చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 20 ఎపిసోడ్ లో చూసేయండి.

పిన్నిని బయట ఉన్న బ్యాగ్ తీసుకుని రమ్మని కాంచన అనగానే.. తమ కోసం ఏమైనా తెచ్చిందేమోనని పారిజాతం పరుగెత్తుకుంటూ వెళ్తుంది. బ్యాగ్ తెచ్చాక అందులో బట్టలు ఉన్నాయని కాంచన చెప్తుంది. నా కొడుకు క్యాంప్ కు వెళ్లాడు. వేసవి సెలవులు కాబట్టి శౌర్యను తీసుకుని మా అక్క ఊరు వెళ్లింది. కొడుకు, మనవరాలు లేని ఇంట్లో కోడలితో నేనేం ఉంటా. అందుకే నా కొడుకు వచ్చేవరకూ పుట్టింట్లో ఉందామని నవ్వుతూ కాంచన చెప్తుంది.

ఇది చీటింగ్ అని జ్యోత్స్న అంటుంది. కానీ వీళ్లు ఇంట్లో ఉండటానికి శివ నారాయణ, దశరథ, సుమిత్ర ఒప్పుకొంటార...