భారతదేశం, మే 30 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో రూ. 10 లక్షల పరిహారానికి బదులు జ్యోత్స్న సారీ చెప్పినట్లు షాప్ ముందు ఫ్లెక్సీ పెట్టేందుకు సూరజ్ ఒప్పుకుంటాడు. ఇంకా నయం నష్ట పరిహారంగా జ్యోత్స్నను జ్యూస్‌లు సర్వ్ చేయాలని అనలేదని పారిజాతం అంటుంది.

ఇది కూడా చాలా న్యాయంగా ఉంది. సరైన సమయంలో కరెక్ట్‌గా న్యాయం చేశారు. ఏ షాప్ దగ్గర నా గౌరవం పోయిందో ఆ షాప్ దగ్గర నా గౌరవం రావాలంటే ఫ్లెక్సీ పెట్టాలి. ఎవరి వల్ల క్వాలిటీ పోయిందో వారి వల్లే సర్వ్ చేస్తే నా పేరు నాకు తిరిగి వస్తుందని సూరజ్ అంటాడు. దీనికి ఒప్పుకోను అని జ్యోత్స్న అంటే.. ఇందులో ఏముంది. దీని వల్ల నీకు కూడా మంచి పేరు వస్తుంది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వస్తుందని కార్తీక్ అంటాడు.

నేను అడగాలనుకుంది ఇదే సర్. ఇక మీరే న్యాయం చేయండని సూరజ్ అంటాడు. దాంతో ...