భారతదేశం, మార్చి 3 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 3 ఎపిసోడ్ లో.. కూతురితో పాటు కూతురి బిడ్డ కూడా రాబోతుందని ఎంతో సంతోషపడ్డా. కూతురి విషయంలో చేసిన తప్పు మనవరాలి విషయంలో సరిదిద్దుకోవాలని అనుకున్నా. అది పుట్టినప్పటి నుంచి నా ఒడిలోనే పెరగాలని అనుకున్నా. నా కూతురు తొలి అడుగులు చూడలేదు. తొలి పిలుపును వినలేదు. ఈ ఆశలన్నీ పుట్టబోయే బిడ్డతో తీర్చుకోవాలని అనుకున్నానని దశరథ ఎమోషనల్ అవుతాడు.

దీప కడుపున అమ్మ పుట్టబోతుందని నా చెల్లి ఆనందపడుతుంది. ఎంతమంది ఆశలను, కలలను చంపేయాలి. ఎవరిని వదులుకోవాలి? మీ అత్త ప్రాణం నిలబెట్టే దేవత ఈ దేవతే అని నాకు అప్పుడు తెలియదు. కడుపున పుట్టిన దేవత. నేను తండ్రిగా ఏం ఇచ్చానని నీ నుంచి తీసుకోవడానికి అని కార్తీక్, దీపతో మాట్లాడుతూ దశరథ ఏడుస్తాడు. జన్మనిచ్చావు కదా నాన్న. తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం ఎంతమందికి వస...