భారతదేశం, అక్టోబర్ 31 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఏ ఆధారంతో కంప్లైంట్ తీసుకున్నారు అని ఎస్సైని నిలదీస్తాడు శివ నారాయణ. గతంలో దీప అని ఎస్సై అంటే గతం గురించి కాదు ఈ కేసు గురించి అడుగుతున్నా. ఏ ఆధారంతో అరెస్ట్ తీసుకొచ్చారు. జ్యోత్స్న చెప్పినట్లు కాంచన ఇంట్లో సుమిత్ర కనిపించిందా. ఉన్నట్లు ఏదైనా ఆధారం దొరికిందా అని శివ నారాయణ రఫ్పాడిస్తాడు.

లేదని ఎస్సై అనడంతో మరి ఎలా అరెస్ట్ చేశారు. చెబుతారా ఐజీకి కాల్ చేయనా అని శివ నారాయణ అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ఎస్సై అంటాడు. ఇప్పుడు ఫైల్ చేయండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు జ్యోత్స్న అంటుంది. అంతవరకు వచ్చిందా. ఎఫ్ఐఆర్ రాయండి. దాంతో పాటు ఈ కేసు కూడా రాయండి. నేను నీ మీద కేసు పెడుతున్నాను. నా కూతురి కోసం నిన్ను నేను సెల్‌లో వేయిస్తాను. నువ్వు ఎస్సైతో మాట్లాడితే నేను ఐజీతో మాట్లాడుతాను. చూసుక...