Hyderabad, జూన్ 19 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శౌర్య అమ్మగారు అని పిలవడంపై దీపను అడుగుతుంది సుమిత్ర. పని మనిషి కూతురు అలాగే పిలుస్తుంది కదా అని దీప అంటుంది. నువ్ ఏ మనిషివో నాకు తెలియదు. అసలు నువ్ ఇంట్లో ఉండటమే నాకు ఇష్టం లేదు. ఇలా నచ్చకపోవడం కూడా నీకు అవకాశంగా మారిందని నిన్న నీ మాటలు వింటేకానీ అర్థం కాలేదు. ఉంటు ఇలా ఎంతకాలం మిమ్మల్ని బాధపెడతావో పెట్టు. కానీ, ఆ చిన్నదాంతో నన్ను అమ్మగారని పిలిపిస్తావేంటీ అని నిలదీస్తుంది సుమిత్ర.

దాని దృష్టిలో కూడా నన్ను చెడ్డదాన్ని చేయాలా అని సుమిత్ర అంటే అయ్యో అది కూడా నా కూతురే కదా అని దీప అంటుంది. ఆ మాటలను కార్తీక్, జ్యోత్స్న వింటుంటారు. అదంతా నాకు సంబంధం లేదు. నా కోపం నీ మీద నీ కూతురు మీద కాదు. దానికి నాకు ఓ బంధం ఉంది అని సుమిత్ర అంటుంది. తెలియకుండా చెప్పిన మామ్ కరెక్ట్‌గానే చెప్పిందని...