భారతదేశం, నవంబర్ 8 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీప కిచెన్‌లో ఏం చేస్తుందో అని పారిజాతం తొంగి చూస్తుంది. కానీ, అది దీప కూడా చూస్తుంది. వంటింట్లోకి పారు రాగానే ఎదురుగా ఉంటుంది. దాంతో భయపడుతుంది పారిజాతం. పారిజాతంతో దీప ఆడుకుంటుంది. ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వవే. వరుసగా వాయించేస్తున్నావ్ అని అంటుంది పారు.

కార్తీక్ గాడే నెక్ట్స్ సీఈఓ అట. బయట టాక్. జ్యోత్స్న వచ్చి బతిమిలాడుకుందే అని పారిజాతం అంటుంది. ప్రతిదానికి కౌంటర్ వేస్తుంది దీప. వెనుకటికి నిలబడటానికి చోటు ఇస్తే పడుకోడానికి చోటు అడిగిందట అని పారు అంటే ఇప్పుడు ఎవరిని ఎవరు అడుగుతున్నారు అని దీప అంటుంది. అమ్మో ఎంత మాట అన్నావే. జ్యోత్స్న అడగడంతో నేను లోకువ అయ్యాను. నా మనవరాలికి అన్యాయం జరగనివ్వను. కార్తీక్ గాడు సీఈఓ ఎలా అవుతాడో చూస్తాను అని వెళ్లిపోతుంది.

కార్తీక్‌ను పిలిచిన శ...