భారతదేశం, జూన్ 19 -- Karthika Deepam 2 Today Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో ఉత్కంఠభరిత మలుపుతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కార్తీక దీపం 2 టుడే జూన్ 19 ఎపిసోడ్‌లో జ్యోత్స్న, సూరజ్ మధ్య సాగిన మైండ్ గేమ్ అదిరిపోయింది. దీప ఎదుగుదలను చూసి పారిజాతం రగిలిపోవడం, లాస్ట్‌లో డెలివరీకి వెళ్లిన సూరజ్‌కు ఊహించని షాక్ తగలడం ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

తనతో చేతులు కలపమని ఇచ్చిన ఆఫర్‌కు సూరజ్ ఒప్పుకోవడంతో జ్యోత్స్న సంతోషిస్తుంది. "ఎలా నమ్మాలి?" అని జ్యోత్స్న అడగ్గా, తన ఫోన్ ఇచ్చి వీడియోలన్నీ డిలీట్ చేసుకోమంటాడు. వీడియోలు డిలీట్ చేయగానే జ్యోత్స్న తన అసలు రంగు బయటపెడుతుంది. కాలు మీద కాలు వేసుకుని పొగరుగా.. "ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, నేను చెప్పినట్లే వినాలి" అని వార్నింగ్ ఇస్తుంది...