భారతదేశం, జూలై 3 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 3 ఎపిసోడ్ లో జ్యోత్స్న, సూరజ్ మధ్య రివేంజ్ డ్రామా హైలైట్ గా నిలిచింది. తనతో స్కూటీ నెట్టించిన జ్యోకు లిప్ స్టిక్ మరకతో సూరజ్ అదిరిపోయే కౌంటర్ ఇస్తాడు. ఇక శివ నారాయణ ఆఫీసులోకి దక్షిణామూర్తి ఎంట్రీతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. ఇంకా కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ లో సూరజ్ స్కూటీపై జ్యోత్స్న రివర్స్ లో కూర్చుని ప్రయాణిస్తుంది. "నువ్వు కేవలం మంత్లీ శాలరీ కోసం పనిచేసే ఎంప్లాయ్ వి మాత్రమే. నీ అకౌంట్ బ్లాక్ చేశారు, నీ దగ్గర మనీ లేదు కాబట్టి నేను డ్రాప్ చేస్తున్నా. నేను ఎలా నడిపినా కామ్ గా కూర్చోవాల్సిందే" అని సూరజ్ అంటాడు. పెళ్లయిన కార్తీక్ ను వదిలేయమని సూరజ్ చెప్పిన విషయాన్ని జ్యో గుర్తు చేసుకుంటుంది.

దారిలో ఓ వ్యక్...