కాపురానికి రావట్లేదని భార్య ముక్కు కొరికేసిన భర్త.. మంచిర్యాలలో దారుణం!
భారతదేశం, సెప్టెంబర్ 16 -- మంచిర్యాల జిల్లాలో కుటుంబ కలహాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. క్షణికావేశం ఓ కుటుంబాన్ని తీవ్ర వేదనలోకి నెట్టింది. కోటపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ అమానుష సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కోటపల్లి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన మణిచందర్కు, అదే మండలానికి చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికిద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగినా, ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. భర్త వేధింపులను తట్టుకోలేకపోయిన మమత, మనస్తాపంతో కోటపల్లిలోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది.
భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన మణిచందర్, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ తీవ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.