భారతదేశం, అక్టోబర్ 22 -- విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ భక్తులను మృత్యువు కబళించింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ మాలధారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన దాదాపు 40 మంది భవానీ భక్తులు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని విజయవాడ వైపు ప్రయాణమయ్యారు. కనకదుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నారు. అయితే వీరి బస్సు కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపానికి చేరుకోగానే వాహనంలో సడన్‌గా సాంకేతిక సమస్య తలెత్తింది.

దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వాహనాన్ని జాతీయ రహదారి పక్కగా సురక్షితంగా నిలిపివేశారు. బస...