భారతదేశం, అక్టోబర్ 15 -- హైదరాబాద్: దసరా పండుగ ముగిసిన తర్వాత తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా సమీకరణకు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ (SIR) తో పాటు ఇతర కీలక అంశాలను లేవనెత్తుతూ దాదాపు రెండు లక్షల మందితో భారీ మార్చ్, బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

బుధవారం విలేకరులతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దక్షిణాదిలోని రెండు ప్రధాన రాష్ట్రాల్లో భారీ బహిరంగ స...