Telangana,hyderabad, ఆగస్టు 11 -- అసమర్థ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఆర్థిక సంక్షోభం నెలకొందని కేటీఆర్ విమర్శించారు. మిగులు బడ్జెట్‌లో ఉండాల్సిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ఖతం పట్టించిందని ఆరోపించారు. కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వ అసమర్థత మరోసారి బయటపడిందన్నారు.

"ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుండా, అప్పులతో ఏం చేస్తున్నారో ప్రభుత్వం బయటపెట్టాలి. కాగ్ ఇచ్చిన తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైంది" అని కేటీఆర్ దుయ్యబట్టారు.

"కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయి. మిగులు బడ్జె...