భారతదేశం, జూన్ 12 -- మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి సర్వోన్నత న్యాయస్థానంలో తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ పార్టీ ఏకైక అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. నామినేషన్ల తిరస్కరణ వ్యవహారంలో ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

అభ్యర్థులపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసులు ఏ దశలో ఉన్నా సరే, వాటి వివరాలను నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది.

"అఫిడవిట్‌లో వాస్తవాలను వెల్లడించకపోతే నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. ఇందులో రిటర్నింగ్ అధికారి ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదు" అని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించిన వాదనలను లైవ్‌...