భారతదేశం, మే 22 -- జీవితం అంటే కేవలం పూలబాట కాదు. ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఎదురుదెబ్బలు తగలడం సహజం. అయితే, ఆ దెబ్బల నుంచి మనం ఎలా కోలుకున్నాం? ఆ గాయాలు మనల్ని ఎలా మార్చాయి? అనేదే అసలైన విజయం. ఇదే విషయాన్ని అమెరికన్ సాహిత్య దిగ్గజం ఎర్నెస్ట్ హెమింగ్‌వే తన 'ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్' (A Farewell to Arms - 1929) నవలలో ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.

"ఈ ప్రపంచం ప్రతి ఒక్కరినీ మనసు విరిగేలా చేస్తుంది.. ఆ తర్వాత, కొందరు మరింత బలంగా తయారవుతారు" అన్నది ఆయన చెప్పిన సారాంశం.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, మానసిక ఒత్తిళ్లు, వ్యక్తిగత సంఘర్షణల నేపథ్యంలో హెమింగ్‌వే రాసిన ఈ వాక్యాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. కష్టాలు కేవలం బాధను మాత్రమే మిగల్చవని, అవి మనిషి వ్యక్తిత్వాన్ని రాటుదేలుస్తాయని ఆయన అక్షరబద్ధం చేశారు.

హెమింగ్‌వే ఆలోచ...