భారతదేశం, ఏప్రిల్ 10 -- హిందూ ధర్మంలో ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా నెలకు ఒకసారి వచ్చే కాలాష్టమికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శివుడి అత్యంత రౌద్ర రూపమైన 'కాలభైరవుడి'ని ఈ రోజున ఆరాధిస్తారు. మనసులో ఉన్న భయాలను పోగొట్టడమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి కాలాష్టమి ఒక అద్భుతమైన అవకాశమని భక్తుల నమ్మకం. ఏప్రిల్ నెలలో (చైత్ర మాసం) వచ్చే కాలాష్టమి తేదీ విషయంలో చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఏప్రిల్ 9 లేదా 10 అనే సందిగ్ధంలో ఉన్న భక్తుల కోసం పంచాంగకర్తలు స్పష్టత ఇచ్చారు.

హిందూ పంచాంగం ప్రకారం, చైత్ర కృష్ణ పక్ష అష్టమి తిథి ఏప్రిల్ 9వ తేదీ రాత్రి 9:19 గంటలకే ప్రారంభమైంది. అయితే, ఏ పండగైనా 'ఉదయ తిథి' (సూర్యోదయ సమయంలో ఉండే తిథి) ఆధారంగా జరుపుకోవడం మన సంప్రదాయం. అష్టమి తిథి ఈరోజు (ఏప్రిల్ 10) రాత్రి 11:15 గం...