భారతదేశం, నవంబర్ 23 -- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (Kawal Tiger Reserve) మరోసారి విదేశీ అతిథులతో కళకళలాడుతోంది. శీతాకాలం ప్రారంభం కావడంతో సైబీరియా, మధ్య ఆసియా, ఇతర ఉత్తర ప్రాంతాల నుండి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అరుదైన వలస పక్షులు కవ్వాల్ అడవులకు చేరుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా జన్నారం ఫారెస్ట్ డివిజన్, పరిసర ప్రాంతాల్లో ఐదు ప్రధాన వలస పక్షి జాతులను అటవీ అధికారులు, వన్యప్రాణి పరిశోధకులు గుర్తించారు. ఈ పరిణామం కవ్వాల్ అభయారణ్య జీవవైవిధ్య ప్రాముఖ్యతను మరోసారి నొక్కిచెబుతోంది.

జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఎం. రామ్మోహన్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ కోఆర్డినేటర్, వన్యప్రాణి పరిశోధకుడు వెంకట్ అనగందుల సంయుక్తంగా చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విదేశీ పక్షులు కెమెరాలకు చిక్కాయి. కేవలం రిజర్వ్ ఫారెస్ట్ ...