భారతదేశం, జూలై 4 -- రాజకీయాల్లో సరికొత్త ప్రస్థానం ప్రారంభించాలని భావించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన(TRS) పేరు రిజిస్ట్రేషన్‌ను సాంకేతిక కారణాలతో ఈసీ తిరస్కరించింది. ఈ పేరు మార్పుపై తక్షణమే స్పందించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కవితకు అధికారికంగా లేఖ అందింది.

ప్రజల్లో గందరగోళానికి తావులేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ పరిణామంతో కవిత అభిమానులు, అనుచరులు ఆందోళనలో పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖలో ఈ పేరును ఎందుకు అనుమతించడం లేదనే విషయాలను స్పష్టంగా వివరించింది. ప్రధానంగా కొన్ని అంశాలను ఈసీ ప్రస్తావించింది.

'టిఆర్ఎస్' (TRS) అనే సంక్షిప్త నామానికి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక ...