భారతదేశం, ఆగస్టు 17 -- తెలంగాణలో పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అందిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాల అమలుపై హైకోర్టు మధ్యంతర స్టే విధించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకాలపై విధించిన స్టేను తొలగించేందుకు త్వరలోనే హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేసింది. గత ప్రభుత్వం తెచ్చిన లోపభూయిష్టమైన ఉత్తర్వుల వల్లే ప్రస్తుత న్యాయపరమైన చిక్కులు తలెత్తాయని, త్వరలోనే అన్ని పొరపాట్లను సరిదిద్ది పథకాలను కొనసాగిస్తామని ప్రకటించింది.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి గతంలో జారీ చేసిన 8 జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ (W.P. No. 21732/2026)పై విచారణ జరిపిన హైకోర్టు, 12.08.2026న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 09.09.2026 వరకు ఈ పథకాలపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. న్యాయస్థానం ఆదేశాల...