Hyderabad, Oct. 26 -- కర్నూల్ జిల్లాలోని చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తుండగా… ప్రమాదానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. బస్సును ఢీకొట్టిన బైక్ పై ఒక్కరు మాత్రమే లేరని… మరో వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. వీరిద్దరూ కూడా మద్యం మత్తులో ఉన్నారని ధ్రువీకరించారు.

అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద స్లీపర్ బస్సును బైక్ ఢీకొట్టింది. బస్సులో 44 మంది ప్రయాణికులు ఉండగా.. 19 మంది సజీవ దహనమయ్యారు. చాలా మంది తప్పించుకోగలిగారు. ద్విచక్రవాహనం బస్సు కిందికి వెళ్లగా… కొంచెం దూరం అలాగే బస్సు ముందుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇంజిన్ లో మంటలు చెలరేగటంతో ఘోర ప్రమాదం జరిగింది.

మద్యం మత్తులో ఆ ఇద్దరు..! బైక్ పై ప్రయ...