భారతదేశం, నవంబర్ 17 -- ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి, దివంగత హీరాబెన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఆలయం నిర్మితమవుతోంది. తల్లిపై కుమారుడికి ఉండే అపారమైన భక్తిప్రపత్తులకు, గౌరవానికి ప్రతీకగా కర్నూలు జిల్లాలో ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామంలోని అర ఎకరం స్థలంలో మాత శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ భూమిపూజ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశేషమేమిటంటే ఈ కార్యక్రమానికి బీజేపీతో పాటు జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తల్లిగారికి ఆలయ...