భారతదేశం, జనవరి 26 -- దిల్లీలోని కర్తవ్య పథ్‌లో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన భారీ సైనిక చర్య 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంతో రూపొందించిన త్రివిధ దళాల శకటం హైలైట్‌గా నిలిచింది. ఇ శకటం దేశ సైనిక పటిమను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగంగా భారత సైన్యం, నావికాదళం, వాయుసేనల ఏకీకృత పోరాట పటిమను ప్రతిబింబిస్తూ 'విక్టరీ త్రూ జాయింట్‌నెస్' అనే ఇతివృత్తంతో ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. యుద్ధ సమయంలో వ్యూహాత్మక ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు, దళాల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో ఈ శకటం కళ్లకు కట్టింది.
ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్లోని నిర్ణయాత్మక సైనిక పోరాటంలో వాయుసేన జరిపిన ఖచ్చితమైన దాడులు, సముద్ర రంగంలో నౌకాదళం చూపిన త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.