Telangana,karnataka, సెప్టెంబర్ 24 -- ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. అయితే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక సర్కార్ చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్రంలోని రాజకీయపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడితే సహించేదే లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నాయి.

అయితే కర్ణాటక ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ప్రతిపాదనలపై తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎత్తు పెంపు ప్రతిపాదలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తుందని స్పష్టం చేశారు.

కృష్ణా నదీ జల...