భారతదేశం, అక్టోబర్ 21 -- అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి వన్యప్రాణులను వేటాడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు మలక్‌పేట వద్ద రట్టు చేశారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక అటవీ ప్రాంతంలో అత్యాధునిక తుపాకీతో జింకలను వేటాడిన ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్, మలక్‌పేట పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నట్లు చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ఖారే కిరణ్ ప్రభాకర్ మంగళవారం వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కర్ణాటకలోని కలబురగి జిల్లా చించోలి తాలూకా పరిధిలో ఉన్న చిమ్మంచోడ్ అటవీ ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు లైసెన్స్‌డ్ తుపాకీతో జింకలను వేటాడినట్లు హైదరాబాద్ పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. ఈ సమాచారంతో తక్షణమే అప్రమత్తమైన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రత్యేక బృందం సోమవారం ముమ్మర వాహన తనిఖీల...