భారతదేశం, జూలై 27 -- జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజుగా భావించే సూర్య భగవానుడి రాశి పరివర్తనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సూర్యుడి సంచారం ప్రతి ఒక్కరి జీవితంపైనా, రాశిఫలాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం చంద్రుని సొంత రాశి అయిన కర్కాటకంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. కాగా. అతిత్వరలోనే పవిత్రమైన శ్రావణ మాసం (సావన్) ప్రారంభం కాబోతోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం జూలై 30 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ మాసంలో అత్యధిక సమయం సూర్యుడు కర్కాటక రాశిలోనే కొలువుదీరి ఉంటాడు.

ఆగస్టు 17, 2026 ఉదయం వరకు సూర్యుడు కర్కాటక రాశిలోనే కొనసాగుతాడు. శ్రావణ మాసంలో శివుడికి ప్రియమైన రోజులలో సూర్యుడు చంద్రుని రాశిలో సంచరించడం కొన్ని రాశుల వారికి అమితమైన శుభఫలితాలను ఇస్తుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఈ సూర్య సంచారంతో మొత్తం 5 రాశుల జాతక...