భారతదేశం, జూలై 9 -- వేద జ్యోతిషశాస్త్రంలో సూర్య భగవానుడికి అత్యున్నత స్థానం ఉంది. సూర్యుడిని ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలు, సామాజిక హోదా, పదవి మరియు శక్తికి కారకుడిగా జ్యోతిష్య నిపుణులు పరిగణిస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న సూర్య దేవుడు 2026 జూలై 16న మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్య సంచార ప్రభావం మొత్తం 12 రాశుల పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్పు వల్ల కొందరికి అద్భుతమైన యోగం పట్టనుండగా, మరికొందరు కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.

ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ అందించిన సమాచారం ప్రకారం.. సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించిన తర్వాత ఐదు రాశుల వారికి కాలం చాలా అద్భుతంగా కలిసి రాబోతోంది. అదే సమయంలో మరో మూడు రాశుల వారు మాత్రం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికతో ఉండాలని ఆయన స...