Andhrapradesh, ఆగస్టు 9 -- ఐఆర్సీటీసీ టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది.తాజాగా కరీంనగర్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'TIRUPATI FROM KARIMNAGAR' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్‌లో తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలను చూడొచ్చు.

ఈ ప్యాకేజీ ఆగస్ట్ 14వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ (https://www.irctctourism.com/) లో చూడొచ్చు. కరీంనగర్ తో పాటు వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికులు ట్రైన్ ఎక్కొచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....