Hyderabad,telangana, సెప్టెంబర్ 21 -- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని గాజులరామారంలో "హైడ్రా" భారీ ఆపరేషన్ చేపట్టింది. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసే పనిలో పడింది. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి కల్పించింది.కబ్జాలు నిర్ధారించుకుని ఆదివారం ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టింది. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణలను తొలగిస్తోంది.

మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో హైడ్రా ఈ ఆపరేషన్ చేపట్టింది. సర్వే నంబర్ 307లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో ఆక్రమణలు తొలగిస్తోంది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమిలో బడా బాబులు ఆక్రమణలు చేసినట్లు గుర్తించింది. ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయాలు చేసినవారిపై చర్యలకు సిద్ధమైంది.

పేదవారిని ముందు పెట్టి..బడాబాబులు వేయించిన షెడ్డులను హైడ్...