భారతదేశం, సెప్టెంబర్ 10 -- గ్రహాలకు రాజుగా భావించే సూర్య భగవానుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ క్రమంలో 2026 సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశి నుంచి నిష్క్రమించి.. కన్యా రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. కన్యా రాశికి అధిపతి బుధుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడికి, బుధుడికి మధ్య మైత్రి భావం ఉంటుంది. మిత్రుని రాశిలోకి సూర్యుడు ప్రవేశించే ఈ ఘట్టాన్ని కన్యా సంక్రాంతి అని పిలుస్తారు.

సూర్య భగవానుడు అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు కన్యా రాశిలోనే సంచరిస్తాడు. జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యుడు ఆత్మవిశ్వాసం, సమాజంలో గౌరవ ప్రతిష్టలు, పితృ కారకుడిగా వ్యవహరిస్తాడు. ఈ సంచార ప్రభావం మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపైనా ఉంటుంది. అయితే, ముఖ్యంగా ఐదు రాశుల ...