భారతదేశం, నవంబర్ 1 -- జ్యోతిష్య శాస్త్రంలో సౌందర్యానికి, ఆకర్షణకు, సంపదకు, దంపతుల సుఖసంతోషాలకు కారకుడిగా భావించే శుక్ర గ్రహం త్వరలోనే తన రాశిని మార్చుకోనుంది. ప్రస్తుతం తులారాశిలో కొనసాగుతున్న శుక్రుడు.. నవంబర్ 6న కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో శుక్రుడు మొత్తం 17 రోజుల పాటు తిరోగమన స్థితిలోనే సంచరిస్తాడు. కాగా, అక్టోబర్ 3 నుంచే ప్రారంభమైన శుక్రుడి వక్రనడక (రివర్స్ మోషన్) నవంబర్ 14 వరకు ఇలాగే కొనసాగుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు.

శుక్రుడి ఈ రాశి మార్పు మొత్తం 12 రాశుల వారి జీవితాలపై స్పష్టమైన ప్రభావం చూపినప్పటికీ, నాలుగు రాశుల జాతకులకు మాత్రం అత్యంత శుభప్రదమైన ఫలితాలను అందించనుంది. ఈ గోచార ప్రభావం వల్ల ప్రజల్లో డబ్బు నిర్వహణపై అవగాహన పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అనవసర వ్యయాలకు చెక్ పెడుత...