భారతదేశం, సెప్టెంబర్ 28 -- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. శ్రీవారికి ఇష్టమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల మెుత్తం గోవింద గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది.

ఆదివారం నాడు తనకు ఎంతో ప్రీతికరమైన గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు అభయమిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు మెుదలైన గరుడ వాహన సేవ రాత్రి వరకు కొనసాగింది. సుమారు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీలకు చేరుకున్నారు. ఈ సేవలను భక్తులు తిలకించేందుకు మాడవీధుల్లో భారీగా స్కీన్స్ కూడా ఏర్పాటు చేశారు. లక్షల సంఖ్యలో భక్తులు గరుడ వాహన సేవను చూసేందుకు తరలివచ్చారు.

సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే.. శ్రీవారి మూలవిరాట్టుకు అలంకరించే.. లక్ష్మీహరం, మకరకంఠి ఆభరణాలతో శ్రీమలయప్పస్వామికి అంలకరిస్తారు. ఐదో ర...