భారతదేశం, మార్చి 11 -- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీలు మారినట్టుగా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వీరిద్దరిపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. మరోవైపు ఈ పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరగనుంది.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని తీర్పులో స్పీకర్ వెల్లడించారు. గురువారం సుప్రీంకోర్టులో విచారణకు ముందే స్పీకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు.

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్‌, అరికెపూడి గాంధీ, పోచంపల్లి శ...