భారతదేశం, సెప్టెంబర్ 1 -- హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ నుండి 12 ఆయుధాలు చోరీకి గురైనట్లు సైనిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయుధాలను భద్రపరిచిన గది తాళాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి వాటిని తీసుకువెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

సైనిక అధికారులు మల్కాజిగిరిలోని బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఇది ఒక రక్షణ సంస్థకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఆయుధాల చోరీలో అంతర్గత వ్యక్తుల పాత్రపై సైనికాధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ దళాల శిక్షణా సంస్థకు అనుబంధంగా అనేక రెజిమెంట్లు పనిచేస్తున్నాయి. మద్రాస్ రెజిమెంట్ వాటిలో ఒకటి, సైనిక సిబ్బంది ఆయుధాలను నిల్వ చేసే ఒక విభాగం ఇక్కడ ఉంది. ...