భారతదేశం, మే 4 -- తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త సంచలనాన్ని సృష్టించాయి. ఈ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఓటర్ల చైతన్యాన్ని కొనియాడారు. ఇదే సమయంలో దళపతి విజయ్ సాధించిన అద్భుత విజయంపై సినీ లోకం కూడా ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందని పవన్ కల్యాణ్ అన్నారు. 'పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని.. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ.' అని పవన్ పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని ఆయన విశ్లేషించారు.

పశ్చిమ బెంగాల్‌లో భాజపా విజయం వెనుక ప్రధాని మోదీ, అమిత్ షా ల అకుంఠిత దీక్...