భారతదేశం, నవంబర్ 16 -- ఇటీవల 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్లను హేతుబద్ధీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ లింగమనేని రమేశ్ అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం క్యాన్సర్ రోగులకు, వారి కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. ఇదే తరహాలో మధుమేహం(డయాబెటిస్), గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల ధరలను కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల కోట్లాది భారతీయ కుటుంబాలపై ఆర్థిక భారం తీవ్రంగా పెరుగుతోందని, క్షేత్రస్థాయిలో ప్రజలు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారని ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. ఫార్మాస్యూటికల్ సరఫరా వ్యవస్థలో వివిధ దశల్లో ఉంటున్న భ...