భారతదేశం, ఆగస్టు 7 -- ఎన్నికల సంఘం (ఈసీ), బీజేపీ కుమ్మక్కై మహారాష్ట్ర ఎన్నికలను దొంగిలించాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలకు మద్దతుగా ఆయన బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపించారు. అక్కడ 'నకిలీ ఓటర్లు', 'డూప్లికేట్ ఓటింగ్' జరిగిందని ఆరోపించారు.

కాగా రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం గట్టిగా బదులిచ్చింది. కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీకి ఒక లేఖ పంపారు. ఆయన చెప్పిన ఆధారాలను సమర్పించాలని కోరారు. తప్పుడు ఆధారాలు ఇస్తే చట్టపరమైన పరిణామాలు ఉంటాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

'ఓట్ల దొంగతనం' జరిగిందన్న తన వాదనను సమర్థించుకునేందుకు రాహుల్ గాంధీ ఒక వీడియోను ప్రదర్శించారు. అందులో కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 16 గెలుచుకుంటుందని అంచనా వేసిందని, కానీ ...