భారతదేశం, ఆగస్టు 27 -- కర్ణాటక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలపై ప్రజా సంఘాలు, పౌర హక్కుల వేదికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై సినీ నటుడు, దర్శక-నిర్మాత ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సెప్టెంబర్ 1న బెంగళూరులో 'ఛలో ఎలక్షన్ కమిషన్' పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, సీఐఆర్‌-2026 ప్రక్రియపై స్టే విధించాలని కోరుతూ పౌర సమాజ సంఘాలు త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు.

"ఈ దేశంలో ఒక ఓటరు, సాధారణ పౌరుడు తన హక్కుల కోసం ఎన్నేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరగాలి? ఓటర్లను ఎందుకు ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు? కర్ణాటకలో శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అలాంటప్పుడు...