భారతదేశం, ఆగస్టు 8 -- లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తన తీవ్ర విమర్శలను మళ్లీ చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో ఈసీ తీవ్రమైన అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ.. ఓటు చోరి అనే తన వాదనకు మద్దతుగా వివిధ రాష్ట్ర ఎన్నికలను ఉదహరించారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత, తటస్థతను ప్రశ్నించారు. 'ఓటు చోరి కేవలం ఎన్నికల కుంభకోణం కాదు, ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి పెద్ద ద్రోహం" అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ తో పాటు ఒక వీడియోను షేర్ చేశారు.

'దేశంలోని తప్పు చేసినవారు దీనిని విననివ్వండి. కాలం మారుతుంది, శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఓట్ల దొంగలకు శిక్ష తప్పదు.' అని రాశారు రాహుల్ గాంధీ.

వివిధ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఫలితాలు పూర్తిగా భిన్నమైన విషయాన్ని ప్రత...