Hyderabad, జూలై 11 -- ఓటీటీలోకి ఎప్పుడు విభిన్న కంటెంట్‌తో సినిమాలు వస్తూ అలరిస్తుంటాయి. వాటిలో కొన్ని అతి తక్కువ సమయంలోనే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంటాయి. అది కూడా కొద్దిరోజులపాటు ట్రెండింగ్‌లో టాప్ ప్లేసులోనే ఉంటాయి. అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ మూవీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఆ హారర్ థ్రిల్లర్ సినిమా పేరే జియామ్. థాయ్ భాషకు చెందిన జాంబీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమానే జియామ్. ఓ వైరస్ వల్ల మనుషులు చనిపోయి మళ్లీ బతికి ఇతర మనుషులను పీక్కుతినేవాళ్లనే జాంబీలు అంటారు. జాంబీ కాన్సెప్ట్‌తో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి.

ఈ జాంబీ కాన్సెప్ట్‌కో కామెడీ, యాక్షన్, ఫాంటసీ, ఎమోషనల్, హారర్ ఎలిమెంట్స్‌ యాడ్ చేసి మరింత రసవత్తరంగా తెరకెక్కిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల మూడు రోజుల క్రితం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ సినిమా జియామ్.

కల్ప్ కల...