భారతదేశం, జనవరి 3 -- 2025లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాయి. ఇందులో ముఖ్యంగా మలయాళం థ్రిల్లర్లు అదరగొట్టాయి. ఇప్పుడు కొత్త ఏడాదిలోనూ ఓటీటీ లవర్స్ ను అలరించేందుకు మలయాళం సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఎకో అనే మలయాళం మూవీ తెలుగులో ఓటీటీలోకి వచ్చింది. 2025లో వచ్చిన బెస్ట్ మలయాళం సినిమాల్లో ఇదొకటనే కామెంట్లు వస్తున్నాయి.

సూపర్ హిట్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఎకో. 2025లో థియేటర్లలో అదరగొట్టింది ఈ మూవీ. రూ.5 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా రూ.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా డిసెంబర్ 31, 2025న పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టింది. కానీ అప్పుడు కేవలం మలయాళంలో మాత్రమే రిలీజైంది. ఇవాళ (జనవరి 3) తెలుగులోకి వచ్చేసింది.

ఇవాళ నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజైంది మిస్టరీ థ్రిల్లర్ ఎకో. నిజానికి జ...