భారతదేశం, నవంబర్ 3 -- ఓటీటీలోకి ఈ వారం ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. అయితే ఇందులో 8 సినిమాలు కచ్చితంగా చూడాల్సినవిగా ఇంట్రెస్టింగ్‌ అండ్ స్పెషల్‌గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆస్కార్ ఐజాక్, జాకబ్ ఎలోర్డి, మియా గోత్, క్రిస్టోఫ్ వాల్ట్జ్ నటించిన సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సినిమా ఫ్రాంకిన్‌స్టన్. ఈ మూవీ నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఆర్టికల్ 370 తరువాత దర్శకుడు ఆదిత్య జంభాలే తెరకెక్కించిన సినిమా బారాముల్లా. మానవ్ కౌల్, భాషా సుంబ్లీ యాక్ట్ చేసిన హారర్ థ్రిల్లర్ బారాముల్లా నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

క్రిస్టల్ డిసౌజా, గుల్షన్ గ్రోవర్, సాకిబ్ అయూబ్, ఆషి సింగ...