భారతదేశం, మే 29 -- థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఎన్నో వివాదాలు, మరెన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన కన్నడ మూవీ 'కేడీ ది డెవిల్'. యాక్షన్ స్టార్ ధృవ సర్జా హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సుమారు నెల రోజుల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 5 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (Zee5)లో అందుబాటులోకి రానుంది.

ఈ విషయాన్ని జీ5 కన్నడ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. "అడుగెడితే దుమ్ము, శ్వాస పీల్చితే రక్తం! డెవిల్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ మొదలైంది.. జూన్ 5 నుంచి కన్నడ జీ5లో కేడీ ది డెవిల్" అనే క్యాప్షన్‌తో ఒక సరికొత్త ట్రైలర్‌ను కూడా పంచుకుంది.

దేశ ప్రధానికి కూడా లేనంత కట్టుదిట్టమైన భద్రత మధ్య 'కాళీ' అనే ఒక పేరుమోస...