భారతదేశం, ఫిబ్రవరి 12 -- తెలుగు సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ ఆధారిత సినిమాలను ఎంచుకోవడంలో, విభిన్నమైన పాత్రలతో ప్రయోగాలు చేయడంలో నవీన్ చంద్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అతడు నటించిన లేటెస్ట్ మూవీ 'హనీ' (Honey) ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా చాలా మందికి తెలియదు. విడుదలైన మొదటి షో నుంచే సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలై, త్వరగానే థియేటర్ల నుంచి ఎగ్జిట్ అయ్యింది.

థియేటర్లలో నిరాశపరిచిన ఈ హనీ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది.

ఫిబ్రవరి 27 నుంచి 'హనీ' సినిమా స్ట్రీమింగ్ కా...