భారతదేశం, జనవరి 27 -- ఈ ఏడాది మలయాళం నుంచి రాబోతున్న మొదటి వెబ్ సిరీస్‌గా 'రోస్లిన్: సీక్రెట్ స్టోరీస్ అన్ఫోల్డ్' (Roslin) నిలవనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ద్వారా ఈ వెబ్ సిరీస్ డిజిటల్ అరంగేట్రం చేయనుందని అధికారికంగా ధృవీకరించారు. సీనియర్ నటి మీనా, ప్రముఖ నటుడు వినీత్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతేడాది డిసెంబరులో జరిగిన 'సౌత్ అన్బౌండ్' ఈవెంట్లో జియోహాట్‌స్టార్ అనౌన్స్ చేసిన ఐదు మలయాళ వెబ్ సిరీస్‌లలో 'రోస్లిన్' కూడా ఒకటి. ఇప్పుడు ఆ జాబితా నుంచి విడుదలవుతున్న మొదటి వెబ్ సిరీస్ ఇదేనని ప్లాట్‌ఫామ్ ఖరారు చేసింది. నిర్మాతలు అధికారిక తేదీని వెల్లడించకపోయినా.. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.