భారతదేశం, డిసెంబర్ 31 -- ప్రముఖ యాంకర్ సుమ కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల, నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ కలయికలో వచ్చిన వినూత్న ప్రేమకథ 'మోగ్లీ'. థియేటర్లలో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా సినీ ప్రియులకు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు మరికొన్ని గంటల్లోనే మోగ్లీ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

"ప్రతీ హీరో నగరంలోనే పుట్టడు.. కొందరు అడవి నుంచి ఉద్భవిస్తారు" అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అనాథగా అడవిలోనే పెరుగుతూ, అక్కడి ప్రకృతిని తన తల్లిగా భావించే ఒక యువకుడు.. అనుకోకుండా షూటింగ్ కోసం అడవికి వచ్చిన ఒక మూగ అమ్మాయితో ప్రేమలో పడతాడు.

వీరిద్దరి స్వచ్ఛమైన ప్రేమకథలోకి ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ ప్రవేశించడంతో కథ ఎలాంటి మలుపులు తీస...