భారతదేశం, నవంబర్ 1 -- మాస్ మహారాజా రవితేజ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆయన సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే, గత కొంతకాలంగా రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. కానీ, వచ్చే ప్రతి సినిమాకు మంచి హైప్ మాత్రం వస్తుంది.

రవితేజ నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే మాస్ జాతర. ఈ సినిమాలో హీరోయిన్‌గా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల చేసింది. ధమాకా హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి నటించిన రెండో సినిమా ఇది. దీంతో ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించారు.

తెలుగులో పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతర సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సి...