భారతదేశం, నవంబర్ 15 -- ఓటీటీలోకి సినిమాలు అతివేగంగా వచ్చేస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన ఓ సినిమా హిట్ అయిన ఫ్లాప్‌ను మూటగట్టుకున్న నెల రోజులు లేదా 2 నెలల లోపే ఓటీటీ రిలీజ్ అవుతోంది. ఇలాంటి తరుణంలో థియేట్రికల్ రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకోవాలనే ఇంట్రెస్టింగ్ అతిగా పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే నిన్న (నవంబర్ 14) థియేటర్లలో విడుదలైన మూవీ కాంత ఓటీటీపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. కాంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇకపోతే కాంత సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, పాపులర్ నటుడు, దర్శకుడు సముద్ర ఖని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించారు.

ఎక్కువగా దుల్కర్, సముద్రఖని పాత్రల చుట్టూనే సినిమా సాగుతుంది. హీరో, డైరెక్టర్ మధ్య ...